అమలాపురం పట్టణ పరిసరాల్లో రోజుకు 10 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు ప్రణాళిక రూపొందించాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
అమలాపురం పట్టణ పరిసరాల్లో రోజుకు 10 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు ప్రణాళిక రూపొందించాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
అమలాపురం పట్టణం చుట్టుపక్కల ఉన్న ఐదు మేజర్ పంచాయతీల నుంచి తడి, పొడి చెత్తను స్థానిక డంపింగ్ యార్డ్‌కు రోజువారీ 10 మెట్రిక్ టన్నుల మేర తరలించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ డిపిఓను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి డంపింగ్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ప్లాస్మా టెక్నాలజీ యూనిట్ ద్వారా చెత్త ప్రాసెసింగ్ పనులపై సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరూరు, బండారులంక, ఇందుపల్లి, ఈదరపల్లి, కామనగరువు పంచాయతీల నుంచి రోజువారీ 10 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తే, పట్టణ ప్రాంతం నుంచి వచ్చే 30 మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 40 మెట్రిక్ టన్నుల చెత్తను ప్లాస్మా టెక్నాలజీ ద్వారా డిస్పోజల్ చేయవచ్చని తెలిపారు.
పంచాయతీల ఆదాయం, ఖర్చు, జనాభా అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. డంపింగ్ యార్డ్‌లకు స్థలాభావం ఉన్నందున ప్లాస్మా యూనిట్‌కు చెత్త రవాణా ఖర్చులను సంబంధిత పంచాయతీలే భరించాలని, అలాగే ప్రాసెసింగ్ చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ శాంతలక్ష్మి, వివిధ పంచాయతీల ఈఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
![]()