క్రీడల్లో జిమ్ ప్రాధాన్యతను వివరించిన ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి
క్రీడల్లో జిమ్ ప్రాధాన్యతను వివరించిన ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 01:
అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ శిక్షణా శిబిరాన్ని ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన క్రీడల్లో జిమ్ మరియు ఫిట్నెస్ ప్రాధాన్యతను వివరించారు. జిమ్ శిక్షణ ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుందని, కండరాల శక్తి, స్టామినా మెరుగుపడతాయని తెలిపారు. గాయాలు తగ్గడంలో కూడా ఫిట్నెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
క్రీడాకారులు జిమ్ శిక్షణను సద్వినియోగం చేసుకుని మంచి ప్రతిభను చూపాలని సూచించారు. క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, కోచ్లు మరియు యువ క్రీడాకారులు పాల్గొన్నారు.
![]()