తాడూరులో ఘనంగా 141వ మేడే వారోత్సవాలు
తాడూరులో ఘనంగా 141వ మేడే వారోత్సవాలు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం 1 మే నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండల కేంద్రంలో 141వ మేడే వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న అధ్యక్షత వహించారు.
సిపిఎం పార్టీ జెండాను సీనియర్ నాయకుడు దాసరి శంకర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ కార్మికుల ఐక్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. “ప్రపంచ కార్మికులారా ఏకంకండ పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప” అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్మికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏనుపోతుల కాశన్న, ఏనుపోతుల వెంకటస్వామి, గడ్డం బంగారయ్య, చెన్న శ్యామ్ సుందర్, అంతటి మహేష్, ఏనుపోతుల చరణ్, జిపి కార్మికులు, పరశురాములు, బాలయ్య, రవి, మేస్త్రిలు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మేడే సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విజయవంతంగా ముగిసింది.
![]()