వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పసలపూడి మాజీ ఎంపీటీసీ కటకం మాణిక్యం
ప్రజా ఆయుధం దినపత్రిక
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పసలపూడి మాజీ ఎంపీటీసీ కటకం మాణిక్యం
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం, ఏప్రిల్ 30:
రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన వైసీపీ మాజీ ఎంపీటీసీ కటకం మాణిక్యం, నల్లమిల్లి వీర్రెడ్డి, నల్లమిల్లి అప్పారెడ్డి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
గ్రామ టీడీపీ నాయకుడు కర్రి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో వీరు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రామచంద్రాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, సత్తి వెంకట కృష్ణారెడ్డి, మల్లిడి సూరెడ్డి, నల్లమిల్లి సతీష్ రెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు, కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, అనుసూరి శ్రీనివాసరావు, పడాల సత్యనారాయణ రెడ్డి, బుంగ పెద్ద, కొల్లి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
![]()