పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శ
ప్రజా ఆయుధం దినపత్రిక
పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శ
ప్రజా ఆయుధం హైదరాబాద్, ఏప్రిల్ 30:
పితృవియోగంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ కూడా పాల్గొన్నారు.
గురువారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని మంత్రి నివాసానికి వెళ్లిన వారు నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలు అందించిన నాదెండ్ల భాస్కరరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
![]()