పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సత్తా
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలు
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట, ఏప్రిల్ 30:
కూటమి ప్రభుత్వం చేపట్టిన మెరుగైన చర్యల ఫలితంగా గురువారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సత్తా చాటారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపి రాణించిన విద్యార్థులందరినీ ఆయన అభినందించారు. నియోజకవర్గంలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆలమూరు మండలం బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని వి. గాయత్రి (592), కొత్తపేట మండలం వానపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె. త్రిమూర్తులు రమ్య (588), తొత్తుపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి. మౌనిక (584), ఆత్రేయపురం మండలం మహాత్మా గాంధీ ఎయిడెడ్ హైస్కూల్ విద్యార్థిని కె. శైలు (584)లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద తనను కలిసిన వానపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె. త్రిమూర్తులు రమ్యను ఆశీర్వదించి, ఆమెను సత్కరించి స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొంటూ వారికి కూడా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
![]()