తల్లి–కుమార్తె ఒకేసారి ఉత్తీర్ణులు – అరుదైన సంఘటన తల్లి ఇంటర్, కుమార్తె టెన్త్లో విజయం
ప్రజా ఆయుధం దినపత్రిక
తల్లి–కుమార్తె ఒకేసారి ఉత్తీర్ణులు – అరుదైన సంఘటన
తల్లి ఇంటర్, కుమార్తె టెన్త్లో విజయం
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, ఏప్రిల్ 30:
తల్లి, కుమార్తెలు ఒకేసారి పరీక్షలు రాసి, ఫలితాలు ఒకే రోజు విడుదల కావడంతో ఇద్దరూ ఉత్తీర్ణులు కావడం ఆలమూరు మండలం పెదపల్లిలో అరుదైన ఘటనగా నిలిచింది.
పెదపల్లికి చెందిన సలాది సాత్విక ఆలమూరు బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాల్లో 543 మార్కులు సాధించింది. అదే రోజు విడుదలైన ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆమె తల్లి కుమారి 352 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించారు.
టెన్త్ పూర్తి చేసిన వెంటనే వివాహం కావడంతో చదువు కొనసాగించలేకపోయిన కుమారి, తిరిగి చదువుపై ఆసక్తితో భర్త ప్రసాద్ ప్రోత్సాహంతో ఓపెన్ ఇంటర్ పరీక్షలకు హాజరై విజయం సాధించడం విశేషం. తల్లి, కుమార్తె ఇద్దరూ ఒకే రోజు ఫలితాల్లో ఉత్తీర్ణులు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
వారి విజయాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈదల సత్తిబాబు, ప్రధాన కార్యదర్శి సలాది నాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు అభినందించారు.
![]()