10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానం –డాక్టర్” కోనసీమ జిల్లా ఘనత
ప్రజా ఆయుధం దినపత్రిక
10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానం – డాక్టర్ “కోనసీమ జిల్లా ఘనత
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏప్రిల్ 30:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ విజయానికి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమిష్టి కృషే కారణమని పేర్కొన్నారు. జిల్లా విద్యా అధికారి ఆధ్వర్యంలో పాఠశాలల్లో నాణ్యమైన బోధన, ప్రత్యేక శ్రద్ధ, పునశ్చరణ తరగతులు, పరీక్షల పట్ల అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అభినందించారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ మంచి ఫలితాలు సాధించారని, ఉపాధ్యాయులు చూపిన అంకితభావం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించేలా మరింత కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారికి మార్గదర్శకులైన ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు.
![]()