10వ తరగతి ఫలితాల్లో సమనస గురుకుల పాఠశాల విద్యార్థుల సత్తా
ప్రజా ఆయుధం దినపత్రిక
10వ తరగతి ఫలితాల్లో సమనస గురుకుల పాఠశాల విద్యార్థుల సత్తా
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, ఏప్రిల్ 30:పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో సమనస గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంజేపీ గురుకుల పాఠశాల నుంచి మొత్తం 62 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాన్ని నమోదు చేయడం విశేషం.
పాఠశాలకు చెందిన ఆర్. దేవి ప్రసాద్ 587 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. డి. కాసు కళ్యాణ్ 576 మార్కులు, కే. బాలాజీవర్మ 568 మార్కులు సాధించి మంచి ఫలితాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.టి.ఎస్. రాజు మరియు స్టాఫ్ విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, పట్టుదల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
![]()