ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు పార్టీ నాయకులు సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి
ప్రజా ఆయుధం దినపత్రిక
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు
పార్టీ నాయకులు సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏప్రిల్ 30:
మే 1, 2026న నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ (పేదల సేవలో) కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు (సాయి) పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, గ్రామ/వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్చార్జ్లు, అబ్జర్వర్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు మరియు ఇతర అన్ని పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయ సిబ్బందితో కలిసి పనిచేయాలని సూచించారు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పేదల సేవే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత సమర్థంగా చేరుతాయని తెలిపారు.
![]()