కోనసీమ కేర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
ప్రజా ఆయుధం దినపత్రిక
కోనసీమ కేర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, ఏప్రిల్ 30:
కొంతకాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న 60 సంవత్సరాల వ్యక్తికి అమలాపురంలోని కోనసీమ కేర్ హాస్పిటల్లో గురువారం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
ఆసుపత్రికి చేరుకున్న అనంతరం పలు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయన కడుపులో అసాధారణంగా ఏర్పడిన పదార్థం (చేప ముల్లు) ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్ కారెం రవితేజ (ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్) వెల్లడించారు.
వెంటనే శస్త్రచికిత్స చేపట్టి సుమారు 6 సెంటీమీటర్ల పొడవు గల అరుదైన చేప ముల్లు) విజయవంతంగా బయటకు తీశామని తెలిపారు.
ఈ శస్త్రచికిత్సను డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో సర్జన్ డాక్టర్ వంశీ విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలో పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.
కొంతకాలంగా ఉన్న కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రమైందని, ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
![]()