2029లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక ప్రార్థనలు – మోకాళ్లపై నడుచుకుంటూ భక్తి ప్రదర్శన
ప్రజా ఆయుధం దినపత్రిక
2029లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక ప్రార్థనలు – మోకాళ్లపై నడుచుకుంటూ భక్తి ప్రదర్శన
పరమట మహేష్ భక్తి, విశ్వాసానికి నిదర్శనం
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, ఏప్రిల్ 30:
2029లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయినవిల్లి మండలంలోని నేదునూరు గ్రామం అశోక్ నగర్‌కు చెందిన పరమట మహేష్ తన భక్తిని చాటుతూ గౌరీపట్నం మేరీ మాత గుడి వరకు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి దేవునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం నా ఆశ మాత్రమే కాదు, ప్రజలందరి కోరిక కూడా” అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిన నాయకుడిగా జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
మోకాళ్లపై నడుస్తూ గుడికి చేరుకున్న పరమట మహేష్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఆయన చేసిన ఈ ప్రత్యేక ప్రార్థనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
పరమట మహేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ వింగ్ కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన భక్తి, విశ్వాసం పట్ల గ్రామస్థులు ప్రశంసలు వ్యక్తం చేశారు.
![]()