పది ఫలితాల్లో తాపేశ్వరం శ్రీ చైతన్య విజయకేతనం… స్టేట్ సెకండ్ ర్యాంక్ – జిల్లా ఫస్ట్ ర్యాంక్
ప్రజా ఆయుధం దినపత్రిక
పది ఫలితాల్లో తాపేశ్వరం శ్రీ చైతన్య విజయకేతనం… స్టేట్ సెకండ్ ర్యాంక్ – జిల్లా ఫస్ట్ ర్యాంక్
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, ఏప్రిల్ 30:
పదవ తరగతి ఫలితాల్లో తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని పెయ్యిల పవిత్ర రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించింది. 598 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ ఏడాది మండపేట నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా పవిత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తం 164 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని నమోదు చేశారు.
అలాగే 597, 596, 595, 594, 593, 592, 591, 590 వంటి అత్యధిక మార్కులు వరుసగా సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి నారాయణ తెలిపారు. తెలుగులో 100 మార్కులు 38 మంది, గణితంలో 57 మంది, సైన్స్‌లో 28 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించడం విశేషం. పాఠశాల సగటు మార్కులు 555గా నమోదైనట్లు ఏజీఎం సురేష్ వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో రీజినల్ ఇన్చార్జ్ నరేష్, ఇన్‌చార్జ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
![]()