మండపేట విజ్ఞాన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. పది ఫలితాల్లో సత్తా
ప్రజా ఆయుధం దినపత్రిక
మండపేట విజ్ఞాన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. పది ఫలితాల్లో సత్తా
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, ఏప్రిల్ 30:
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండపేట ఆలమూరు రోడ్డులోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
స్కూల్లో జి. భావన 581 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించగా, పి. ప్రియాంక 577 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఓ. మనోజ్ఞ 569 మార్కులతో మూడవ స్థానం, పి. వైష్ణవి 565 మార్కులతో నాలుగవ స్థానం, బి. యశశ్రీ 561 మార్కులతో ఐదవ స్థానం, జ్యోతిష్య 560 మార్కులతో ఆరవ స్థానం సాధించారు.
స్కూల్ నుంచి 20 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. అంటే ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు 500 మార్కుల మైలురాయిని అధిగమించినట్లు స్పష్టమైంది.
ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ ఇనపకొళ్ల గణేష్ చౌదరి విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. స్కూల్ ఫస్ట్ సాధించిన భావనకు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండు సంవత్సరాలు పూర్తిగా ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జ్ శివప్రసాద్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
![]()