100% ఫలితంతో శానపల్లిలంక జడ్పి హైస్కూల్ సత్తా చాటింది
ప్రజా ఆయుధం దినపత్రిక
100% ఫలితంతో శానపల్లిలంక జడ్పి హైస్కూల్ సత్తా చాటింది
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, ఏప్రిల్ 30:
పదవ తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శానపల్లిలంక విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు.
ఈ విద్యాసంస్థ నుంచి పరీక్షలకు హాజరైన 35 మంది విద్యార్థులు అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని నమోదు చేశారు.
ఈ సందర్భంగా దేవ గుప్తాపు పూజ శ్రీ 587 మార్కులతో మండల స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించింది. అలాగే గుమ్మడి రజిని 587 మార్కులతో మండల ద్వితీయ స్థానంలో నిలిచింది. గోడి జనప్రియ 584 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి మండలంలో పాఠశాలకు గౌరవం తీసుకొచ్చింది.
విద్యార్థుల ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేస్తూ, కృషి, పట్టుదలతో విద్యార్థులు ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. అన్ని విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
![]()