వివాహ విందుకు హాజరైన ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు… ముస్లిం బంధువులకు శుభాకాంక్షలు
వివాహ విందుకు హాజరైన ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు… ముస్లిం బంధువులకు శుభాకాంక్షలు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం మడకశిర, ఏప్రిల్ 28:
మాజీ ఎంపీ సైఫుల్లా మనవడు, పార్టీకి అంకితభావంతో పనిచేసిన దివంగత నాయకుడు రహంతుల్లా కుమారుడు అరాఫత్ వివాహ విందు కార్యక్రమానికి సత్యసాయి జిల్లా మడకశిర శాసనసభ్యులు ఎం.ఎస్ రాజు జిల్లా టీడీపీ నాయకులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన దంపతులను కలసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ మనసారా ఆశీర్వదించారు.
అదేవిధంగా ముస్లిం సాంప్రదాయానికి అనుగుణంగా “బారక్ అల్లాహు లకుమా, వ బారక్ అలైకుమా, వ జమఅ బైనకుమా ఫీ ఖైర్” అనే ప్రార్థన సందేశాన్ని తెలియజేస్తూ, దంపతులు అల్లాహ్ కరుణతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబంలో ఐక్యత, ఆనందం నిండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
![]()