క్రైస్తవులపై దాడులు అరికట్టాలి… దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
క్రైస్తవులపై దాడులు అరికట్టాలి… దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం అమలాపురం, మే 5:
క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ మేరకు మే 5, 2026 మంగళవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పదివేల మంది క్రైస్తవులతో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.
ఈ ర్యాలీలో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు, దైవజనులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, యువత, మహిళలు భారీగా పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు పలు నినాదాలను వెల్లడించారు:
మత స్వేచ్ఛ మన హక్కు
మతం మారితే కులం మారదు
క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి
1950 ప్రెసిడెంట్ ఆర్డర్ రద్దు చేయాలి
జిల్లాలోని మూడు ఫెలోషిప్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా క్రైస్తవ జేఏసీ విజ్ఞప్తి చేసింది.
![]()