గాయపడిన నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
గాయపడిన నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం పి.గన్నవరం, ఏప్రిల్ 27:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని కే. ఏనుగుపల్లి గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు తోలేటి సత్తిబాబు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
అదేవిధంగా ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న జనసేన పార్టీ నాయకుడిని కూడా ఎమ్మెల్యే కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు నాయకులు త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పార్టీకి వెన్నెముకలాంటివారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. నాయకులు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కూటమి నాయకులు, టిడిపి కార్యకర్తలు, జనసైనికులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పరామర్శతో బాధిత నాయకుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
![]()