వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపే చర్యలు – ఈదరపల్లిలో ఉపకరణాల పంపిణీ
ప్రజా ఆయుధం దినపత్రిక
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపే చర్యలు – ఈదరపల్లిలో ఉపకరణాల పంపిణీ
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 28:
అమలాపురం నియోజకవర్గంలోని వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. మంగళవారం అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లిలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ మెషిన్లు (శ్రవణ యంత్రాలు), సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికలాంగుల పట్ల మానవత్వంతో ఆలోచించి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు పెంచి అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి వికలాంగుడిని గుర్తించి, రాబోయే ఆరు నెలల్లో అవసరమైన ఉపకరణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికలాంగులు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ పెచ్చెటి చంద్రమౌళి, కడలి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయవెంకటలక్ష్మి, పొలమూరి ధర్మపాల్, జనసేన నాయకులు ఏడిద శ్రీను, తిక్కిరెడ్డి నేతాజీ, చొల్లంగి సాయిబాబు, అరిగేలా నానాజీ, గోసంగి ఆనందరావు, కడిమి అర్జున్, బీజేపీ నాయకులు సుబ్బరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో వికలాంగులు పాల్గొన్నారు.
![]()