పట్టాభి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ చింతా అనురాధ
ప్రజా ఆయుధం దినపత్రిక
పట్టాభి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ చింతా అనురాధ
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 27:
జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నేత వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి కుటుంబాన్ని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ సోమవారం పరామర్శించారు.
వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి మావయ్య వల్లూరి పుల్లాజీ చౌదరి ఇటీవల మరణించగా, మండపేటకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, జెడ్పీటీసీ కుడుపూడి రాంబాబు, మాజీ వైస్ చైర్మన్ వేగుళ్ల నారయ్య బాబు, మాజీ కౌన్సిలర్లు నీలం దుర్గా, మొండి భవాని, జొన్నపల్లి సత్తిబాబు, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా, తాడి రామారావు, అందనపల్లి రవి శంకర్, మోర్త శ్యామ్, కోమోజు దుర్గారావు, సాధనాల శివ భగవాన్, పెచ్చేటి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
![]()