అర్జీల పరిష్కారంలో నాణ్యత, సమయపాలన పాటించాలి – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
అర్జీల పరిష్కారంలో నాణ్యత, సమయపాలన పాటించాలి – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27:
పిజిఆర్ఎస్లో అందిన అర్జీలను నాణ్యతతో పాటు నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ జి. మమ్మీ, డీఆర్డీఏ పీడీ రాంబాబు, ఎస్డీసీ పి. కృష్ణమూర్తి, డీఎల్డీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సుమారు 195 అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో హేతుబద్ధత, పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, సమస్యకు తగిన పరిష్కార మార్గాలను వేగవంతంగా చూపాలని అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో సమర్థత అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, తిరిగి రీఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు.
ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు శాఖల మధ్య సమన్వయం కీలకమని, అధికారులు సమిష్టిగా పని చేయాలని సూచించారు. అర్జీల పరిష్కార దిశగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
![]()