స్వయం సహాయక సంఘాలు, పెన్షనర్ల సమస్యలకు కాల్ సెంటర్ – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
స్వయం సహాయక సంఘాలు, పెన్షనర్ల సమస్యలకు కాల్ సెంటర్ – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27:
స్వయం సహాయక సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే డీఆర్డీఏ సర్ప్ కాల్ సెంటర్‌ను సంప్రదించి పరిష్కార మార్గాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్లో కాల్ సెంటర్ ప్రచార గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8978881621 మొబైల్ నంబర్‌కు పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు.
ప్రజలకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ టి. రాంబాబు, డీపీఓ శాంత లక్ష్మి, డీపీఎం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
![]()