కొత్తపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ – సమానంగా ఇంధన విక్రయాలపై ఆర్డీవో ఆదేశాలు
ప్రజా ఆయుధం దినపత్రిక
కొత్తపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ – సమానంగా ఇంధన విక్రయాలపై ఆర్డీవో ఆదేశాలు
ప్రజా ఆయుధం కొత్తపేట, ఏప్రిల్ 26:
పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు, రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొత్తపేట ఆర్డీవో జి. మమ్మీ ఆదివారం పట్టణంలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బంకుల స్టాక్ రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్డీవో, అక్కడ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అందుబాటులో ఉన్న నిల్వలను బట్టి వినియోగదారులకు సమాన ప్రాతిపదికన ఇంధనం విక్రయించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
పరిస్థితి దృష్ట్యా తహసిల్దార్ వై. రాంబాబు, ఎస్సై జి. సురేంద్ర నేతృత్వంలో బంకుల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
![]()