దేశానికి దశా దిశలు నిర్దేశించిన మహానుభావుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ – గొల్లపల్లి అమూల్య
ప్రజా ఆయుధం దినపత్రిక
దేశానికి దశా దిశలు నిర్దేశించిన మహానుభావుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ – గొల్లపల్లి అమూల్య
ప్రజా ఆయుధం రావులపాలెం/రాజోలు, ఏప్రిల్ 25:
రావులపాలెంలో జై భీమ్ త్రిసంఘ్ సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో, మతానికో చెందినవారు కాదని, దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. దేశానికి దశా దిశలు నిర్దేశించిన మహానుభావుడిగా అంబేద్కర్ సేవలను కొనియాడారు.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు లభిస్తున్నాయంటే అది అంబేద్కర్ చూపిన మార్గం వల్లేనని, మనమందరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన జయంతోత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చిలువూరి సతీష్ రాజు, స్థానిక మహిళా నాయకురాళ్లు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.
![]()