అనారోగ్యంతో ఉన్న నాయకుడిని పరామర్శించిన గుత్తుల సాయి – పలు కార్యక్రమాలు
ప్రజా ఆయుధం దినపత్రిక
అనారోగ్యంతో ఉన్న నాయకుడిని పరామర్శించిన గుత్తుల సాయి – పలు కార్యక్రమాలు
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 25:
అనారోగ్యంతో ముమ్మిడివరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అయినాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు యనమదల సుబ్బారావును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
అనంతరం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చినగాడవెళ్లిలో నిర్వహించిన రాయుడు వారి ఓణీ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం పెదమెట్లంక గ్రామంలో జరిగిన దూనబోయినవారి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాల్లో గుత్తుల వెంకన్నబాబు, కాట్రేనికోన మండలం ఐటిడిపి అధ్యక్షుడు విత్తనాల జయభార్గవ్, వాసంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎన్డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
![]()