గొప్ప మానవతావాది చింతపల్లి వీరభద్రరావుకు ఘన నివాళులు – అమూల్య
ప్రజా ఆయుధం దినపత్రిక
గొప్ప మానవతావాది చింతపల్లి వీరభద్రరావుకు ఘన నివాళులు – అమూల్య
ప్రజా ఆయుధం రామచంద్రపురం/రాజోలు, ఏప్రిల్ 25:
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన చింతపల్లి వీరభద్రరావు సంతాప సభలో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
అమూల్య మాట్లాడుతూ చింతపల్లి వీరభద్రరావు విలువలతో కూడిన నాయకుడని, కల్మషం లేని మనిషిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. పదవికంటే మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సంతాప సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని నివాళులర్పించారు. అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధుర్ బాలయోగి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కూటమి పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి సత్యం, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు తదితరులు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
![]()