మహిళలపై వ్యాఖ్యల కేసులో చర్యలు తీసుకోవాలి – ఏబీఎన్ రాధాకృష్ణపై FIR డిమాండ్
ప్రజా ఆయుధం దినపత్రిక
మహిళలపై వ్యాఖ్యల కేసులో చర్యలు తీసుకోవాలి – ఏబీఎన్ రాధాకృష్ణపై FIR డిమాండ్
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 25:
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, మహిళలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమని, సమాజానికి హానికరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా స్థాయిలో, కొత్తపేట నియోజకవర్గం నుంచి ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వ్యక్తి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()