ఆదివారం కూడా కరెంట్ బిల్లు కౌంటర్లు ఓపెన్ – వినియోగదారులకు ప్రత్యేక సౌకర్యం
ప్రజా ఆయుధం దినపత్రిక
ఆదివారం కూడా కరెంట్ బిల్లు కౌంటర్లు ఓపెన్ – వినియోగదారులకు ప్రత్యేక సౌకర్యం
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 25:
వినియోగదారుల సౌకర్యార్థం తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లు వసూళ్ల కౌంటర్లు రేపు (ఏప్రిల్ 26, ఆదివారం) కూడా పనిచేయనున్నాయి. ఈ విషయాన్ని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కాకిలేటి తిలక్ కుమార్ తెలిపారు.
సెలవు దినమైనప్పటికీ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యుత్ బిల్లులను చెల్లించాలని ఆయన కోరారు. రెవెన్యూ కార్యాలయాలతో పాటు ఏపీఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఎ.టి.పి సెంటర్లలో కూడా ఆదివారం బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎస్.ఈ విజ్ఞప్తి చేశారు.
![]()