పోస్ట్‌మాన్ దాసరి నాగేశ్వరరావు మృతి
ప్రజా ఆయుధం దినపత్రిక
పోస్ట్‌మాన్ దాసరి నాగేశ్వరరావు మృతి
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 25:
రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో క్యాష్ ఓవర్సియర్గా పనిచేస్తున్న దాసరి నాగేశ్వరరావు (50) హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం పోస్టల్ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
నాగేశ్వరరావు గతంలో ఏడిద సీతానగరంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా, మండపేటలో పోస్ట్‌మాన్‌గా సేవలు అందించి, ప్రస్తుతం రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలతో పాటు అధికారుల మన్ననలు పొందారు.
ఆయన మృతి పట్ల పెన్షనర్ల సంఘం నాయకులు టీ పుల్లేశ్వరరావు, బి రామగంగాధరం, సలాది సత్యనారాయణమూర్తి, రాజనగరం సబ్ పోస్ట్ మాస్టర్ కేజే సతీష్ తదితరులు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
![]()