మంత్రి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్
ప్రజా ఆయుధం దినపత్రిక
మంత్రి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్
ప్రజా ఆయుధం రామచంద్రపురం, ఏప్రిల్ 25:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.ఎస్. కుమారీశ్వరన్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో రామచంద్రపురం ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌తో కలిసి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ పనితీరు, అమలవుతున్న విధానాలు, ముఖ్యంగా గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం వాటా అమలు వంటి అంశాలపై మంత్రి సుభాష్‌కు వివరించారు. గీత కార్మికుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి సుభాష్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, గీత కార్మికుల హక్కులు, అవకాశాల పరిరక్షణలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ పనితీరును మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. ఈ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగింది.
![]()