ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన హౌసింగ్ పీడీ – గృహ నిర్మాణాలపై సమీక్ష
ప్రజా ఆయుధం దినపత్రిక
ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన హౌసింగ్ పీడీ – గృహ నిర్మాణాలపై సమీక్ష
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 25:
తూర్పుగోదావరి జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్ కుమార్ శనివారం మండపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మొక్కను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం మండపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు హౌసింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల అమలు, పెండింగ్ ఇళ్ల నిర్మాణాల పూర్తి, లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు గృహాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని, పనుల్లో నాణ్యత పాటించడంతో పాటు సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు కూడా హౌసింగ్ పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ డి.ఇ., మూడు మండలాల ఏ.ఇ.లు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
![]()