జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవికి శుభాకాంక్షలు తెలిపిన రజని
ప్రజా ఆయుధం దినపత్రిక
జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవికి శుభాకాంక్షలు తెలిపిన రజని
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 25:
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వైఖోమ్ నిడియా దేవిని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యమంతుల రజని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రజని పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ నిడియా దేవి స్పందిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ భేటీలో పరస్పర అభినందనలు తెలిపుకుంటూ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ జరిగినట్లు సమాచారం.
![]()