అమలాపురం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కాశి శేషారావు ఎంపిక
ప్రజా ఆయుధం దినపత్రిక
అమలాపురం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కాశి శేషారావు ఎంపిక
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 24:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కాశి శేషారావు ఎంపికైనట్లు బార్ అసోసియేషన్ ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కటికదల సత్యనారాయణ తెలిపారు.
ఈ మేరకు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ భవనంలో జరిగింది. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను పలువురు న్యాయవాదులు అభినందించారు.
నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నల్లా సురేష్ కుమార్, కార్యదర్శిగా డి.వి.వి.ఎస్. మూర్తి, గ్రంథాలయ కార్యదర్శిగా జల్లి శ్రీనివాసరావు, కోశాధికారిగా రాపాక దేవదీవెన ఎంపికయ్యారు.
సీనియర్ కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.డి. ఆజం, కుడిపూడి అశోక్, సి.వి. సూర్యనారాయణ, అబ్బిరెడ్డి సురేష్, కె. శశిధర్ శ్రీరామ్, బడుగు భాస్కర్ జోగేష్, దాసరి అప్పలస్వామి, శ్రీమతి దాసరి శ్రీలత, శ్రీమతి గుత్తుల విజయశ్రీ ఎంపికైనట్లు తెలిపారు.
![]()