జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఖోమ్ నిడియా దేవి
ప్రజా ఆయుధం దినపత్రిక
కోనసీమ జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఖోమ్ నిడియా దేవి
అమలాపురం, ఏప్రిల్ 23:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన వైఖోమ్ నిడియా దేవి గురువారం అమలాపురం కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి జిల్లా కలెక్టర్‌ను వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడంతో పాటు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
నూతన జాయింట్ కలెక్టర్‌కు జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు. జిల్లా పాలనలో తమ వంతు సహకారం అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి మాట్లాడుతూ, కోనసీమ జిల్లాలో బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
జిల్లా అధికారుల సమన్వయంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ ఉదయభాస్కర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ పి శ్రీనివాస్, ఎల్డిఎం కేశవ వర్మ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()