చెల్లి అశోక్ నేతృత్వంలో నిరసన – అనంతబాబు అరెస్ట్ చేయాలి: అమలాపురంలో దళితుల ఆగ్రహం
ప్రజా ఆయుధం దినపత్రిక
చెల్లి అశోక్ నేతృత్వంలో నిరసన – అనంతబాబు అరెస్ట్ చేయాలి: అమలాపురంలో దళితుల ఆగ్రహం
అమలాపురం, ఏప్రిల్ 22:
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అమలాపురం నల్లవంతెన వద్ద దళిత నాయకులు, టిడిపి శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సాక్షులకు బెదిరింపులు, ప్రలోభాలు పెడుతున్నారని, కోర్టులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కేసును ప్రభావితం చేయడానికి సాక్షులకు డబ్బులు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని, మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. గతంలో ఈ కేసులో సాక్ష్యాలు దాచిపెట్టబడ్డాయని, ప్రస్తుతం విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.
2022లో జరిగిన ఈ ఘటనలో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి, దానిని ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగిందని వారు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేసులో సంబంధం ఉన్న వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఈతకోట నాగేశ్వరరావు, అయితాబత్తుల రాజశేఖర్, వస్కా శ్యామ్, బడుగు భాస్కర జోగేష్, గెల్లా అశోక్, మోర్తా సత్తిబాబు, కుసుమ బహుగుణ, నాగబత్తుల ప్రసాద్, కుంచె వెంకన్నబాబు, మందా రాజేష్, అయితాబత్తుల శ్రీనివాసరావు, ముత్తబత్తుల రమణ, కాశీ లాజర్, బడుగు వెంకటేష్, బత్తుల సాయి, విప్పర్తి రమణ, కుంచె రమేష్, నాగబత్తుల బాలసుబ్బారావు, గిడ్ల వెంకటేష్, గెల్లా బాబీ, నక్కా తులసి అంబేద్కర్, గొల్లపల్లి రాజేష్, కుంచె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
![]()