అంబేద్కర్ అందరివాడు” జాతీయ మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ
ప్రజా ఆయుధం దినపత్రిక
“అంబేద్కర్ అందరివాడు” జాతీయ మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ
రామచంద్రపురం, ఏప్రిల్ 21 (మంగళవారం):
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 26న పిఠాపురం రోడ్డులోని పవర గ్రామంలో నిర్వహించనున్న “అంబేద్కర్ అందరివాడు” జాతీయ మహాసభకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి, మతానికి చెందిన నాయకుడు కాదని, ఆయన అందరివాడని స్పష్టం చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా విశేష గౌరవాన్ని పొందిందని, ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
జాతీయ మహాసభ ద్వారా అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో “అంబేద్కర్ అందరివాడు” ప్రపంచ ప్రచారకర్త బుర్రా విజయ్ కుమార్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, కూటమి పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()