డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: టౌన్ సిఐ సురేష్
ప్రజా ఆయుధం దినపత్రిక
డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: టౌన్ సిఐ సురేష్
మండపేట, ఏప్రిల్ 21 (మంగళవారం):
డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మండపేట టౌన్ సిఐ సురేష్ సూచించారు. మండపేటలో విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అన్నపూర్ణ హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే పోక్సో చట్టం, ఫిర్యాదు చేసే విధానాల గురించి సిఐ సురేష్ వివరించారు.
సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాలు, సైబర్ బెదిరింపులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
“డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యానికి, భవిష్యత్తుకు కలిగే నష్టాలను వివరించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
![]()