ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పరిటాల సునీత ఘన స్వాగతం
ప్రజా ఆయుధం దినపత్రిక
ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పరిటాల సునీత ఘన స్వాగతం
అనంతపురం, ఏప్రిల్ 21:
అనంతపురం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌కు మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పరిటాల సునీత ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్ఛాలు అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళితుల స్థితిగతులు, వారి సామాజిక అభ్యున్నతిపై చైర్మన్‌తో సుదీర్ఘంగా చర్చించారు. దళిత సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
అదేవిధంగా, ఇంటర్మీడియట్లో 989 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన శింగనమల నియోజకవర్గం శోధనపల్లి గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని అనురాధను చైర్మన్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో వేగం తీసుకురావడానికి ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణను సత్వరంగా పూర్తి చేసే విధంగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
బాధితులకు న్యాయం త్వరగా అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
![]()