ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా… ఎంపీ హరీష్ బాలయోగి శుభాకాంక్షలు
ప్రజా ఆయుధం దినపత్రిక
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా… ఎంపీ హరీష్ బాలయోగి శుభాకాంక్షలు
అమలాపురం, ఏప్రిల్ 20:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమలాపురం రూరల్ మండలం రోళ్లపాలెం గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి హాజరై ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్న నాయకత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రికి దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()