క్రైస్తవ పద్ధతిలో చిన్నారి సత్యలాస్యకు ఘనంగా “”అన్నప్రాసన””
క్రైస్తవ పద్ధతిలో చిన్నారి సత్యలాస్యకు ఘనంగా “”అన్నప్రాసన””
ప్రజా ఆయుధం దినపత్రిక రామచంద్రపురం, ఏప్రిల్ 17:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో శనివారం ఉదయం కాండ్రకోట సాయికుమార్–మేరీ దంపతుల ముద్దుల కుమార్తె “సత్యలాస్య” అన్నప్రాసన కార్యక్రమం క్రైస్తవ సంప్రదాయంలో ఘనంగా నిర్వహించారు.
దైవ సేవకుల సమక్షంలో ప్రార్థనలు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని ఆచరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్ మరియు వైద్యభీమా శాఖల మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి సత్యం పౌండేషన్ చైర్మెన్, వాసంశెట్టి సత్యం గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ దళితరత్న అవార్డు గ్రహీత నేదునూరి వీర్రాజు దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి సత్యలాస్య అన్నప్రాసన కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో, విద్యాభాస్యంలో ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, కుటుంబానికి, గ్రామానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబారెడ్డి గారు, మోర్త చినబాబు మోర్త దోర బాబు , సతీష్, స్థానిక రాజకీయ నాయకులు, ప్రముఖులు, గ్రామ పెద్దలు, క్రైస్తవ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()