గంగ్గుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు – ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ శుభాకాంక్షలు
ప్రజా ఆయుధం దినపత్రిక
గంగ్గుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు – ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ శుభాకాంక్షలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం కే జగన్నాధపురం గ్రామంలో మాజీ జెడ్పిటిసి సభ్యురాలు గంగ్గుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆనందోత్సాహాలతో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ పూల మొక్క అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి సందర్భాల్లో మొక్కలు నాటడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
గంగ్గుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే నాయకురాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో జెడ్పిటిసి సభ్యురాలిగా పనిచేసిన సమయంలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని, అదే సేవా స్పూర్తితో భవిష్యత్తులో కూడా మరింతగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను మరింత ఉత్సాహంగా మార్చారు.
![]()