కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు… శుభాకాంక్షలు తెలిపిన నేదునూరి వీర్రాజు
ప్రజా ఆయుధం దినపత్రిక
కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు… శుభాకాంక్షలు తెలిపిన నేదునూరి వీర్రాజు
అయినవిల్లి, ఏప్రిల్ 17: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యురాలు గంగ్గుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ శుక్రవారం తన స్వగృహంలో జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి సభ్యులు నేదునూరి వీర్రాజు, అమ్మాజీలు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని పువ్వుల మొక్క అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ కూడా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ఈ వేడుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
![]()