టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ శిక్షణా తరగతులు… సీఎం చంద్రబాబుతో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
ప్రజా ఆయుధం దినపత్రిక
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ శిక్షణా తరగతులు… సీఎం చంద్రబాబుతో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
అమరావతి, ఏప్రిల్ 17:
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంపై నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఆయన అభినందించారు.
పార్టీ శ్రేణులు ప్రజలతో మరింత అనుసంధానమై పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ శిక్షణా తరగతుల్లో సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()