అసెంబ్లీలో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమావేశం… పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక
అసెంబ్లీలో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమావేశం… పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
వెలగపూడి, ఏప్రిల్ 17:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనంలోని మొదటి అంతస్తు, రూమ్ నెం. 201లో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
సమావేశం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా, గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక నివేదికలు మరియు సాధారణ కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థల పనితీరుపై విస్తృతంగా చర్చించారు.
కమిటీ సభ్యులు ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్రంగా విశ్లేషించారు. అలాగే పనితీరును మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను చర్చించినట్లు సమాచారం.
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం, పారదర్శకత పెంపొందించడం, వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
![]()