బైపీసీలో 973 మార్కులు… మండల టాపర్గా నిలిచిన చిల్లే జ్యోత్స్న
ప్రజా ఆయుధం దినపత్రిక
బైపీసీలో 973 మార్కులు… మండల టాపర్గా నిలిచిన చిల్లే జ్యోత్స్న
అయినవిల్లి, ఏప్రిల్ 16:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని శ్రీ నరహరిశెట్టి వెంకటరావు గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు చెందిన చిల్లే జ్యోత్స్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది.
అయినవిల్లి మండలంలోని అన్ని కళాశాలలలో టాపర్గా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కాటూరి స్వర్ణ కుమారి మరియు అధ్యాపకులు జ్యోత్స్నను పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి, స్వీట్లు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జ్యోత్స్న కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
![]()