ఇంటర్ ఫలితాల్లో ఎంపీఎం ట్రస్ట్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా… ప్రతిభ కనబర్చిన వారికి అభినందనలు
ప్రజా ఆయుధం దినపత్రిక
ఇంటర్ ఫలితాల్లో ఎంపీఎం ట్రస్ట్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా… ప్రతిభ కనబర్చిన వారికి అభినందనలు
అయినవిల్లి, ఏప్రిల్ 16:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ఎస్. మూలపాలెంలోని ఎంపీఎం ట్రస్ట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి కాలేజీకి మంచి పేరు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ కేబీవి మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వరరావు, జువాలజీ లెక్చరర్ జి. లీలాకృష్ణ, కెమిస్ట్రీ లెక్చరర్ బి.వి.వి. రామకృష్ణ, ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్. సత్తిబాబు, తెలుగు లెక్చరర్ కె.వి.వి. ప్రసాద్, ఎకనామిక్స్ లెక్చరర్ వి. సుధాకర్ రావు కలిసి విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రమశిక్షణతో చదువుతూ లక్ష్యసాధనకు కట్టుబడి ఉండడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కాలేజీ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని, ఇదే ఉత్సాహంతో రాబోయే పరీక్షల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
![]()