చిన్నారికి ఆశీస్సులు… పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రాజేశ్వరి, వైసీపీ నేతలు
ప్రజా ఆయుధం దినపత్రిక
చిన్నారికి ఆశీస్సులు… పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రాజేశ్వరి, వైసీపీ నేతలు
రాజోలు, ఏప్రిల్ 16:
రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో నిర్వహించిన మోకా కెవిన్ పుట్టినరోజు వేడుకల్లో రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ సీఈసీ సభ్యుడు కేఎస్ఎన్ రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ పాముల కూడా పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పద్మరాజు రుద్రరాజు, రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి సహాదేవ్ తాడి, సఖినేటిపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్, నాయకులు చింత ప్రసాద్, నల్లి ఆశీర్వాదం తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందించారు.
![]()