రాపాక జయశ్రీ సంస్మరణ సభలో నివాళులు… పాల్గొన్న రాజేశ్వరి, కేఎస్ఎన్ రాజు
ప్రజా ఆయుధం దినపత్రిక
రాపాక జయశ్రీ సంస్మరణ సభలో నివాళులు… పాల్గొన్న రాజేశ్వరి, కేఎస్ఎన్ రాజు
రాజోలు, ఏప్రిల్ 16:
రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం కేశనపల్లి తూర్పుపాలెం గ్రామంలో రాపాక సూర్య తల్లి రాపాక జయశ్రీ ప్రథమ సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైసీపీ సీఈసీ సభ్యుడు కేఎస్ఎన్ రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ పాముల పాల్గొని జయశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జయశ్రీ సేవలను స్మరించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్, నాయకులు ముప్పర్తి త్రిమూర్తులు, కంచర్ల శేఖర్, గెడ్డం తులసి భాస్కర్, బల్ల శ్రీను, చింత ప్రసాద్, జాలెం జనార్దన్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
![]()