ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావును పరామర్శించిన రాజేశ్వరి
ప్రజా ఆయుధం దినపత్రిక
ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావును పరామర్శించిన రాజేశ్వరి
రాజోలు, ఏప్రిల్ 16:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు ఇటీవల గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయనను పరామర్శించారు.
బి. సావరంలోని ఆయన నివాసానికి వెళ్లిన రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ పాముల, నాయకుడు చింత ప్రసాద్ కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు.
![]()