ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఏడిద హై స్కూల్ ప్లస్…..

మండపేట ఏప్రిల్ 15: ప్రజా ఆయుధం దినపత్రిక:
మండపేట మండలం ఏడిద హై స్కూల్ ప్లస్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లోతమ సత్తా చాటారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో బైపీసీ లో 976 మార్కులతో పి రమ్యశ్రీ ఎం మేఘన లు పాఠశాల ప్రధమస్థానం పొందారు. 941 మార్కులతో పి మహేశ్వరి ద్వితీయ స్థానం సాధించింది. ఎంపీసీ లో ఎన్. దివ్య 794 మార్కులు ఎన్. మానస 749 మార్కులు సాధించారు.
మొదటి సంవత్సరం ఫలితాల్లో ఏ. దివ్య 450 మార్కులు ఏ .జ్యోతి 444 మార్కులు బైపిసి లో సాధించారు. పాఠశాల ఉత్తీర్ణత శాతం బైపీసీలో 88.2 కదా ఎంపీసీలో నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణతసాధించారు.
ఇంటర్లో ప్రథమ స్థానం సాధించిన వారికి ప్రముఖ పారిశ్రామికవేత్త నామాల పురుషోత్తం రావు ప్రతి విద్యా సంవత్సరం ఐదు లక్షల రూపాయలు నగదు అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఆ నగదును ఇద్దరు విద్యార్థులు బహుమతిగా అందుకోనున్నారు.